- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Monkeypox: మంకీ పాక్స్ కొత్త వ్యాధి కాదు.. భయపడకండి: కేంద్ర మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: Monkeypox not a new Disease, Don't Panic, Says Mansukh Mandaviya| ప్రపంచంలో మంకీపాక్స్ వణుకు పుట్టిస్తోంది. ప్రతి దేశంలో వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంకీ పాక్స్ భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతోంది. కాగా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలని మార్గదర్శకాలు జారీ చేస్తోంది. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. మంకీపాక్స్‌కు బయపడొద్దంటూ ఆయన చెప్పకొచ్చారు. మంకీపాక్స్ కొత్త వ్యాధి కాదని, దానికి చికిత్స ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ఇప్పటికే ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వీటిని నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. 'ప్రపంచంలో మంకీపాక్స్ కేసులు రావడం మొదలయినప్పుడే భారత్ సన్నద్ధం కావడం ప్రారంభించింది. మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు కావల్సిన ఏర్పాట్లను చేయడం మొదలుపెట్టింది' అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మంకీ పాక్స్ ఇండియాలో, ప్రపంచంలో కూడా కొత్త వ్యాధి కాదని, ప్రతి ఒక్కరి వద్ద ఇందుకు చికిత్స ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్.. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు
- Tags
- Monkeypox