- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mohini Dey: రెహమాన్ తో సంబంధం.. విడాకుల లింక్ వార్తలపై స్పందించిన మోహిని దే
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత.. రెహమాన్ - సైరా (Rahman - Saira Divorce) బాను దంపతుల విడాకుల ప్రకటన సినీ లోకాన్ని, అభిమానుల్ని షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. రెహమాన్ దంపతులు విడాకుల ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఆయన టీమ్ లోని బాసిస్ట్.. మోహిని దే (Mohini Dey) కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడంతో.. రకరకాల వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా ? అందుకే తమ భాగస్వాముల నుంచీ విడాకులు తీసుకుంటున్నారా అని చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై మోహిని దే స్పందించింది. తమపై వస్తోన్న రూమర్స్ ను ఆమె తీవ్రంగా ఖండించింది.
విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి తన ఇంటర్వ్యూల కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, తనను ఎందుకు ఇంటర్వ్యూ అడుగుతున్నారో తెలుసని చెప్పుకొచ్చింది. ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వనని తెగేసి చెప్పింది. వాళ్లు అడగాలనుకుంటున్న దాని గురించి మాట్లాడేందుకు తనకు ఆసక్తి లేదని, ఇలాంటి రూమర్స్ మాట్లాడి విలువైన సమయాన్ని వృథా చేసుకోలేనంది. దయచేసి తమ ప్రైవసీని గౌరవించాలని కోరింది. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని సైరా తరపు లాయర్ స్పష్టం చేశారు.
Read More..
మోహిని- రెహమాన్ ఎఫైర్ పై స్పందించిన తనయుడు.. చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్