రాజధాని ప్రాంతంలోని కూలీలను ఆదుకోండి.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

by Vinod kumar |
రాజధాని ప్రాంతంలోని కూలీలను ఆదుకోండి.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటున్న నిరుపేదలకు ప్రభుత్వం నుంచి ఇచ్చే రూ.2,500ను రూ.5 వేలకు పెంచి ఇవ్వాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోరారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. సీఆర్‌డీఏలో ల్యాండ్‌పులింగ్‌ కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అక్కడ బడాబాబులు, పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్‌ పులింగ్‌కు భూములు ఇచ్చారు.

ఇక్కడ సామాన్యులు, పేదలు, దళితులు కూడా నివసిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలోని పేదలైన 52 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సీఎం జగన్ సహృదయంతో ముందుకు వచ్చారని అయితే దానిపై టీడీపీకి చెందిన కొందరు నేతలు కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. వడ్డెమాను, దొండపాడు లాంటి 16 గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు జీవనోపాధికి భూములు కూడా లేవని ఉపాధి దొరకడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.

అలాంటి పేదలకు రూ.5 వేలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మరోవైపు తుళ్లూరు రాజధానిలో ఉన్నా కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. రాయపూడి గ్రామంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. ఆ గ్రామంలో ఈద్గాలో లేదు. సీడ్‌యాక్సిన్‌ రోడ్డులో టెంట్లు వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ భూములు లేవు. ఉన్న భూమి సీఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లింది. పంచాయతీ పరిధిలోని భూముల్లో కొంత స్థలం కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed