ఎంత ఖర్చైనా సరే.. అభివృద్ధే మా లక్ష్యం: MLA

by GSrikanth |
ఎంత ఖర్చైనా సరే.. అభివృద్ధే మా లక్ష్యం: MLA
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖ‌ర్చు చేస్తామ‌ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో దాదాపు రూ 2.15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో క‌లిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. రూ.65ల‌క్షల‌ వ్యయంతో శ్రీ‌రామ‌ హిల్స్ కమ్యూనిహాల్, హిమపూరి కాలనీ కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన, మ‌రో రూ.60 ల‌క్షల‌తో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, ప‌వ‌న్‌గిరి కాలనీలో రూ.30 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన, రూ.10 లక్షలతో వీరన్న గుట్ట కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, ఎల్ఐసీ కాలనీ ప్రహరీ గోడ నిర్మాణం, రూ.20 లక్షలతో కమ్యూనిటీ హాల్‌‌కు ఎమ్మెల్యే శంకుస్థాప‌న‌లు చేశారు. అనంత‌రం మధుర నగర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ఛైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కోసనం ధనలక్ష్మి, నాయ‌కులు జక్కిడి రఘువీర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed