- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే రోజా భేటీ
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన మొదలు పెట్టింది. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంటే మరోవైపు వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి అనుబంధ విభాగాలను ఎన్నికలకు రెఢీ చేస్తున్నారు. వరుసగా అన్ని విభాగాలతో భేటీ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మహిళా విభాగం పై విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు.
మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట : విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని వైసీపీ పార్లమెంటరీ నేత, అనుబంధ విభాగాల ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై రోజాతో విజయసాయిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు.