- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
దిశ, అల్వాల్: అభివృద్దిని అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తే సహించేదిలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఇటీవల చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ''నేను అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి బహిష్కరించిన యాప్రాల్ మధుసుదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీదేవి ఆమె భర్త హన్మంతరావులను బీజేపీలో చేర్చుకొని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న నాకు హెచ్చరికలు చేయడం రాంచందర్ రావులాంటి పర్సనాలిటీకి తగదన్నారు. భూ కబ్జాదారులను పక్కన కూర్చోబెట్టుకొని మీడియాలో మాట్లాడడం బాగానే ఉంటదని, కానీ, ఇక్కడ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయని తెలిపారు. నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా రాజీనామా చేస్తానని తెలిపారు.
ఆర్‌యూబీ నిర్మాణంలో కానీ, నాలాల అభివృద్ధిలో కానీ అడ్డుకుంటుంది ఎవరో మల్కాజిగిరి ప్రజలకు తెలుసని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లను ఆదరిస్తాను, నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు అని తెలిపారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తాను తప్ప అభివృద్ధి విషయంలో ఏనాడూ మైపంపల్లి హన్మంతరావు రాజకీయాలు చేయలేదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మీనా ఉపేందర్ రెడ్డి, రాజ్‌జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు అనిల్, కిశోర్ గౌడ్, కొండల్‌రెడ్డి, బద్దం పరశురాంరెడ్డి, జీఎన్‌వీ సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రాముయాదవ్, గుండా నిరంజన్, మోహన్ రెడ్డి, సంతోష్, రాందాస్, మహిళా నాయకులు గద్వాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.