- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
దిశ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్‌లో రూ.45 లక్షలు, అల్వాల్ డివిజన్వేణుగోపాల్నగర్లో రూ.60 లక్షలతో ఇరు ప్రాంతాలలో రూ. కోటి ఐదు లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం ఒక మినీ ఇండియా లాంటిదని ఇక్కడ అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. వారికి రాజకీయలు అవసరం లేదని ఓటు వేసినందుకు వారికి కావలసింది అభివృద్దే అన్నారు. అది చేసి చూపెడుతున్నామని తెలిపారు. కొందరు పనిగట్టుకుని అభివృద్ది పనులు చేసే వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కాలంలోనే రాజకీయాలు మాట్లాడుతాను, మిగితా టైమ్‌లో రాజకీయాలకు అతీతంగా చేపడుతూ ముందుకు పోతానని తెలిపారు. రాజకీయాలు వేరు.. ప్రజలు వేరని వారికి కావలసినది అభివృద్ధి మాత్రమేనని మరోసారి గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.
అనంతరం కార్పొరేటర్లు రాజ్జితేంద్ర నాథ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ.. నేడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహకారంతో నిధులకు కొరత లేకుండా అభివృద్ధి లో ముందున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో.. సమస్యలు లేని డివిజన్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్డిప్యూటీ కమిషనర్నాగమణి, ఈఈ రాజు, డీఈ. మహేష్, ఏఈ రవళి, వర్క్ఇన్స్పెక్టర్ అఫ్రోజ్, ఏఎంహెచ్ఓ నిర్మల, శానిటరీ సూపర్ వైజర్బుచ్చయ్య, కాలనీవాసులు నర్సింగ్‌రావు, ఏఈ. లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.