ఆశా కార్యకర్తలు సేవలు వెలకట్టలేనివి :ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

by samatah |
ఆశా కార్యకర్తలు సేవలు వెలకట్టలేనివి :ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
X

దిశ సిర్పూర్ (టి): కరోనా సమయంలో ఆశాకార్యకర్తలు చేసిన సేవలు వెలకట్టలేనివి అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం సిర్పూర్ మండలంలోని సివిల్ ఆసుపత్రిలో 34 మంది ఆశాకార్యకర్తలకు తన సొంతగా యూనిఫాం కిట్ (మూడు చీరలు)ను అందజేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ సోకిన వారికి కిట్ అందజేయటంతో పాటు ప్రజల హెల్త్ ప్రొఫైల్ సేకరించడంలో ఆశా కార్యకర్తల ధైర్యంగా సేవలందించారని, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story