అభాగ్యురాలికి అండగా ఎమ్మెల్యే చిరుమర్తి

by Mahesh |
అభాగ్యురాలికి అండగా ఎమ్మెల్యే చిరుమర్తి
X

దిశ, రామన్నపేట: అభాగ్యురాలికి అండగా నిలిచారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మండలంలోని నిధానపల్లి గ్రామానికి చెందిన భాష మల్ల మంగమ్మ అనారోగ్య సమస్యతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవ తీసుకుని మహిళ వైద్యానికి బాసటగా నిలిచారు. వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను తానే స్వయంగా సీఎం కార్యాలయానికి వెళ్లి సీఎం సహాయ నిధి ద్వారా రూ.1.50 లక్షల చెక్కును మంజూరు చేయించారు. మంజూరు అయిన చెక్కును గురువారం హైదరాబాద్‌లో బాధిత మహిళ కుమారుడు రామకృష్ణ కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి, సర్పంచ్ గుత్తా నర్సిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story