- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను మించిన మాస్ లేరు.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వికారాబాద్ : విధానపరమైన విమర్శలు చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రతిపక్ష నాయకులను హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణలో భాగంగా స్థానిక గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్ రెడ్డిని పట్టుకొని గుడ్లు అమ్ముకునేటోడని, నన్ను పట్టుకొని ఆపరేషన్లు చేసేటోడు అని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గుడ్లు అమ్ముకోవడం, ఆపరేషన్‌లు చేయడం ఏమైనా తప్పా అని ప్రశ్నించారు. అది మా వృత్తి మాత్రమే, అంతే తప్ప మీలాగా మేము ఏదైనా తప్పు చేస్తే విమర్శించవచ్చు అని అన్నారు. రాజకీయ విమర్శలు అంటే ఆరోగ్యకరంగా, విధానపరమైన విమర్శలు చేసుకోవాలి తప్ప, ఇలా చీప్ గా వ్యక్తిగత విమర్శలు చేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని హెచ్చరించారు. మేము మీలా వ్యక్తిగత విమర్శలు చేయాలి అనుకుంటే మమ్మల్ని తట్టుకోవడం మీ వల్ల కాదని, మీ గత చరిత్రలు ఏంటో మాకు తెలుసు, మీ చరిత్రలు బయటపెట్టే స్థితికి పరిస్థితులను తీసుకురావద్దని హెచ్చరించారు. నేను ఇక్కడే పల్లెటూర్లో పుట్టి పెరిగాను నేను రంగంలోకి దిగితే నన్ను మించిన ఊరమాస్ ఎవరు ఉండరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్థానిక ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు. ఈ సమావేశంలో లో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ముద్ద దీపా భక్తవత్సలం, పీఎసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పా