- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూట్యూబ్ ఛానెల్‌లకు కేంద్రం జలక్!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఐటి రూల్స్, 2021 నోటిఫికేషన్‌ను తెచ్చిన తర్వాత మొదటిసారిగా 22 యూట్యూబ్ ఛానెల్‌లపై చర్యలు తీసుకుంది. వీక్షకులకు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారనే కారణంతో 22 యూట్యూబ్ ఛానెల్‌లు(నాలుగు పాకిస్థాన్‌కు చెందినవి), మూడు ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ ఖాతా, ఒక వార్తా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
"భారత సాయుధ దళాలు, జమ్మూ, కాశ్మీర్ మొదలైన వివిధ విషయాలపై నకిలీ వార్తలను, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి తప్పుడు కంటెంట్‌ను ప్రచురించాయని, ఇతర టీవీ న్యూస్ ఛానెల్‌ల టెంప్లేట్‌లు, లోగోలను ఉపయోగిస్తున్నాయని యూట్యూబ్ ఛానెల్‌లపై నిషేధం విధిస్తున్నట్లు" మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌ల వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉంది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను చెడగొట్టే కంటెంట్‌పై తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.