- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితుల స్థితిగతులను మార్చేందుకు 'దళిత బంధు'.. మంత్రి హరీష్ రావు
దిశ సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ 'దళిత బంధు' పథకానికి ఎన్నికైన మొత్తం 101 మంది లబ్ధిదారులకు గానూ 70 మంది లబ్దిదారులకు గురువారం కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంజూరీ పత్రాల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత స్థితిగతులను మార్చేందుకు సీఎం పవిత్ర ఉద్యమంలా చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం దళిత బంధు అని పేర్కొన్నారు.
భూమి మీద ఎక్కడా లేనివిధంగా బ్యాంకు బాదరాబందీ లేకుండా స్వయం ఉపాధి యూనిట్ ల స్థాపించే దళితులకు దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది.. 5 గురు లబ్దిదారులకు ఒక్కో ప్రత్యేక అధికారినీ నియమిస్తున్నాం.. ఇగురం తో వ్యాపారం జెయ్యాలే.. బ్రతుకులను తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి చెంది సమాజంలో గెలిచి నిలబడాలన్నారు. తమ తర్వాతి లబ్దిదారులకు ఇంటికి పెద్దన్నలా ఆదర్శంగా నిలబడాలని మంత్రి లబ్దిదారులకు ఉద్బోధ చేశారు.
సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపుమాపడమే దీని ఉద్దేశ్యం అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీ స్వయం ఉపాధి యూనిట్ మంజూరు అనేక నిబంధనలు ఉండేవన్నారు. బ్యాంక్ లింకేజి యూనిట్ లు కావడం వల్ల బ్యాంకర్ లు, అధికారుల చుట్టూ.. కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదన్నారు. 'దళిత బంధు' పథకంలో లబ్దిదారుడి వాటా లేదు, బ్యాంక్ లోన్ లేదు.. నెలనెలా EMI కట్టాల్సిన అవసరం లేదు. మిత్తి కట్టాల్సిన బాధ అసలే లేదు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
అమ్ముతే.. కొన్న వ్యక్తిని జైలుకు పంపిస్తాం
లబ్దిదారులు గ్రౌండింగ్ చేసిన యూనిట్‌లను అమ్మితే కొన్న వ్యక్తిని జైల్ కు పంపిస్తామని మంత్రి తెలిపారు. యూనిట్‌ను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. మోటర్ యూనిట్ లను అమ్ముకునే ఆస్కారం లేకుండా RTA కు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ జరగకుండా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాలన్నారు.
గల్లా పెట్టె మీద ఎస్సీల ను కూర్చో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే..
మద్యం షాపుల కేటాయింపుల్లో ఎస్సీ లకు రిజర్వేషన్ లను కల్పించి మద్యం షాప్ ల గల్లా పెట్టె మీద ఎస్సీల ను కూర్చో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే నని మంత్రి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు టెండర్ లలో కూడా ఎస్సీ లకు రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. మెడికల్ షాప్ లు, ఫెర్టిలైజర్ షాప్ లలో కూడా ఎస్సీ లకు రిజర్వేషన్ లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
బంజేరు పల్లికి బండ్లు కట్టాలే..
ఇబ్రహీం పూర్ తో అభివృద్ధిలో పోటీ పడే బంజేరు పల్లి 'దళిత బంధు' పథకంలో కూడా ఆదర్శంగా నిలవాలని అన్నారు. బంజేరు పల్లికి బండ్లు కట్టాలే యూనిట్ లు సక్సెస్ అయ్యేలా చూడాలన్నారు. సిద్దిపేట టౌన్, ఏళ్ళయి పల్లి, చెలక పల్లి లబ్దిదారులు కూడా తర్వాత వచ్చే లబ్దిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు.