- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ప్లాస్టీక్' మయమౌతున్న మనిషి!' నిన్న రక్తంలో ఇప్పుడక్కడ..?!
దిశ, వెబ్‌డెస్క్ః ప్లాస్టీక్ మానవ జీవితంలో భాగమయ్యింది. అంతటితో ఆగక ఇప్పుడు మనిషి దేహంలోనే భాగమవుతున్న పరిస్థితులకు చేరుకుంది. అవును, నిజమే! తాజాగా యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ హల్ కాజిల్ హిల్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుల బృందం, మానవ రోగుల నుండి తొలగించిన ఊపిరితిత్తుల కణజాలంలో ప్లాస్టిక్ సూక్ష్మ కణాలను గుర్తించారు. జీవించి ఉన్న మానవ రోగుల్లో ఇటువంటి పదార్థాలు మొదటిసారిగా కనుక్కోవడం ఆందోళనకు గురిచేస్తుంది. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ఈ బృందం తమ పరిశోధనను వివరిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
ఇటీవల, కొన్ని అధ్యయనాలు జంతువుల్లోనే కాక, మానవుల రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించాయి. జీవించి ఉన్న మరియు మరణించిన మానవుల ప్లీహము, మూత్రపిండాలు, కాలేయాల్లో ప్లాస్టీక్ కణాలు కనుగొన్నారు. గత నెల నెదర్లాండ్స్‌కు చెందిన ఒక బృందం మానవ రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించాయి. ఇక తాజాగా, మనిషి ఊపిరితిత్తుల కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌లున్నట్లు నివేదించారు. పరిశోధనా బృందం 13 నమూనాలను సేకరించగా, వాటిలో 11 నమూనాల్లో ప్లాస్టిక్ ముక్కలు ఉండటం ఇప్పుడు పరిశోధకులను కలవరపెడుతోంది.
ప్లాస్టిక్ బిట్‌లను అధ్యయనం చేసేటప్పుడు పరిశోధకులు 12 రకాల ప్లాస్టీక్‌లను కనుగొన్నారు. వీటిలో సాధారణ గృహోపకరణాలలో ఉపయోగించే దుస్తులు, ప్యాకేజింగ్, బాటిళ్ల వంటివి ఉన్నాయి. అయితే, ఆ ప్లాస్టిక్ బిట్స్ ఊపిరితిత్తుల ఎగువ భాగంతో పాటు, దిగువ ప్రాంతంలోనూ కనుగొంది. ఊపిరితిత్తుల్లో అటువంటి భాగాలలో వాయుమార్గాలు చాలా చిన్నవిగా ఉండటం, కణాలు వాటిని చేరుకోవడం చాలా కష్టతరం అయినప్పటికీ ప్లాస్టీక్ అక్కడికి చేరడం ఆశ్చర్యం కలిగించింది. ఇక, మహిళల కంటే కంటే పురుషుల్లోనే ఈ ప్లాస్టిక్‌ల స్థాయిలు ఎక్కువగా ఉండటం పరిశోధకులు గమనించారు. ప్లాస్టిక్ ముక్కలు శరీరంలో ఉండటం వల్ల వ్యక్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, వాటిపై పరిశోధనలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.