- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > Telugu News > మెట్‌పల్లిలో టీఆర్ఎస్‌కు షాక్.. ఆ హామీ నెరవేర్చలేదని పార్టీకి జెడ్పీటీసీ రాజీనామా
మెట్‌పల్లిలో టీఆర్ఎస్‌కు షాక్.. ఆ హామీ నెరవేర్చలేదని పార్టీకి జెడ్పీటీసీ రాజీనామా

X
దిశ, మెట్‌పల్లి రూరల్: రైతులకు ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదని మెట్‌పల్లి జెడ్పీటీసీ కాటిపెళ్లి రాధ, శ్రీనివాస్ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ.. యాసంగి వడ్లు కొనుగోలు హామీ, ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయిస్తానని ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని.. ఈ విషయంపై ప్రజలు తమను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకెళ్లగా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు తమ రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపామని వెల్లడించారు.
Next Story