- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జబర్దస్త్ కొత్త యాంకర్ తనేనా?

దిశ, సినిమా : తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోస్‌లో జబర్దస్త్ ఒకటి. చిన్నా పెద్ద అందరూ ఎంజాయ్ చేసే ఈ షో దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక జబర్దస్త్ విజయానికి కారణమైన మెయిన్ పిల్లర్స్‌లో యాంకర్ అనసూయ ఒకరు. ఈ 'షో'తో సంవత్సరాల రిలేషన్‌షిప్ ఉన్న అనసూయ ప్రస్తుతం వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. సుడిగాలి సుధీర్ కూడా అదే బాటలో ఉన్నాడు. ఇప్పటికే జడ్జిలు నాగబాబు, రోజా నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్పీలు పడిపోయే పరిస్థితి తలెత్తడంతో తాజాగా కొత్త యాంకర్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో కొత్త యాంకర్ వెనుక జబర్దస్త్ కమెడియన్స్ అందరూ నడుస్తున్నట్లుగా చూడవచ్చు. కానీ ఆమె ముఖం మాత్రం రివీల్ చేయలేదు. కొన్ని అంచనాల ప్రకారం హోస్ట్‌గా అనసూయ స్థానంలో మంజుష ఎంపికైనట్లు తెలుస్తోంది. కొత్త యాంకర్‌తో ఎపిసోడ్ ఆగస్ట్ 4న ప్రసారం కానుండగా.. మరి ఇలాగైనా జబర్దస్త్‌కు పూర్వ వైభవం తిరిగొస్తుందో లేదో చూడాలి.