అంతక్రియలకు వెళ్లి చెరువులో శవమై తేలిన బంధువు

by S Gopi |
అంతక్రియలకు వెళ్లి చెరువులో శవమై తేలిన బంధువు
X

దిశ, కోటపల్లి: అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బమన్ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(65) తీగాల్ పహాడ్ గ్రామంలో స్థిరపడ్డారు. శుక్రవారం తన గ్రామానికి చెందిన నాయిని పోచం అనే వ్యక్తి మరణించడంతో అంత్యక్రియలకు హాజరై సమీపంలోని చెరువులో స్నానం చేస్తుండగా కాలు జారి గల్లంతయ్యాడు. ఇది గమనించని బంధువులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు అదే చెరువుకు పోచం బంధువులు స్నానానికి వెళ్లగా లక్ష్మయ్య మృతదేహం కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed