Mahesh Babu : మేనల్లుడి సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..!!

by Anjali |   ( Updated:2024-11-23 12:48:55.0  )
Mahesh Babu : మేనల్లుడి సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ నంద్యాల(Arjun Nandyala) దర్శకత్వం వహించిన ‘దేవకీ నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva) చిత్రం నిన్న(నవంబరు22) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటించాడు. నల్లపనేని యామిని సమర్పణ(Nallapaneni Yamini offering)లో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌(Lalithambika Productions banner)పై సోమినేని బాలకృష్ణ(Somineni Balakrishna) (ఎన్‌ఆర్‌ఐ) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్‌గా నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అయితే తాజాగా మేనల్లుడి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికన ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ‘అశోక్ గల్లా.. మూవీలో నీ మార్పు చాలా బాగుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మీ టీమ్ అందరికి నా అభినందనలు” అంటూ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Read More..

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘OG’రిలీజ్ డేట్ ఫైనల్..?


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed