- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శ్రీకృష్ణుడు కలలో చెప్పారు.. మరోసారి అధికారంలోకి యోగీ
by Harish |

X
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హర్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కాషాయ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు రాత్రి కలలోకి వచ్చి యోగీ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారన్నారు. అంతకు ముందు కూడా తనదైన వ్యాఖ్యలతో ఈ ఎంపీ వార్తల్లో నిలిచారు. గతంలో ఆదిత్యనాథ్‌ను మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కృష్ణుడు చెప్పారని తెలిపారు. అయితే యోగీ గోరఖ్ పూర్ ఆర్బన్ స్థానం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 'ఈ ఎగ్జిట్ పోల్స్ యాధృచ్ఛికంగా లేవు. గత రాత్రి భగవాన్ శ్రీ కృష్ణ నా కలలోకి వచ్చారు. యోగీనే ఈ పని చేస్తారు. యోగీ తన భక్తుడని కూడా చెప్పారు. యోగీ ప్రభుత్వమే మిగతా పనిని పూర్తి చేయడానికి అధికారంలోకి వస్తుంది. ఏ ఒక్కరూ దీనిని సవాల్ చేయలేరు' అని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఓటమిని అంగీకరించలేకపోతున్నారని ఆరోపించారు.
Next Story