Om Birla: బలహీనతగా భావించవద్దు.. సభ్యులకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-25 10:58:08.0  )
Lok Sabha Speaker Om Birla Warns As Opposition Shows Placards
X

దిశ, వెబ్‌డెస్క్: Lok Sabha Speaker Om Birla Warns As Opposition Shows Placards| లోకసభలో ఆందోళన చేస్తున్న సభ్యులపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ వంటి అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తా అని స్పీకర్ ప్రకటించినప్పటికీ.. సభ్యులు నిరసనలు తెలిపారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పినా.. సభ్యులు శాంతించలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్లకార్డులు పట్టుకుని ఉన్న ఎంపీలపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్‌ను కోరారు.

స్పీకర్ ముందుగా హెచ్చరించినా.. పట్టించుకోకుండా కొందరు ఎంపీలు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ వెల్‌లోకి రావడంతో సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత 3 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. దీంతో దేశంలో ప్రజలు సభ సజావుగా సాగాలని కోరుకుంటున్నారని, కానీ సభ్యుల ప్రవర్తన ఇలా ఉంటే హౌస్ తన కార్యకలాపాలను కొనసాగించలేదని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించిన వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. వాటిని పక్కన పెడితే చర్చించేందుకు తాను సిద్దమే అని అన్నారు. తన దయను బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. సభలో ఆందోళనలు అనుమతించనని అన్నారు. సభా నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటానని స్పీకర్ హెచ్చరించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి: ద్రౌపది నా అసలు పేరు కాదు..

Advertisement

Next Story

Most Viewed