సహకార సంఘంలో రూ. 13లక్షలు స్వాహా.. చైర్మన్‌కు డైరెక్టర్లకు మధ్య విభేదాలు

by Manoj |
సహకార సంఘంలో రూ. 13లక్షలు స్వాహా.. చైర్మన్‌కు డైరెక్టర్లకు మధ్య విభేదాలు
X

దిశ, మర్రిగూడ: మర్రిగూడ ప్రాథమిక సహకార సంఘంలో రూ. 13లక్షలు స్వాహా అయ్యాయి. డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి లక్షల రూపాయలు డ్రా చేసినట్లు సంబంధిత డైరెక్టర్లు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి ప్రభుత్వం నుంచి పంపిణీ అయిన గోనె సంచులు అమ్మేసి.. గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని బుకాయింపు చేస్తున్నారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దసరా మామూలు కని రూ. 50,000 ఖర్చు అయినట్టు మినిట్స్‌లో నమోదు చేశారు. వాటితో పాటు మీటింగులకు రూ. 57,000 ఖర్చు అయినట్టు రికార్డులో తప్పుడు లెక్కలు నమోదు చేశారని డైరెక్టర్లు వివరించారు.

వైస్ చైర్మన్‌ను నియమించాలని డైరెక్టర్లు తీర్మానించారు. అయితే సంబంధిత అధికారి తీర్మానం చేయకపోగా.. ఏడున్నర లక్షలు ఇస్తే వైస్ చైర్మన్ పదవిని భర్తీ చేస్తాం అని అనడం సహకార సంఘంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. డైరెక్టర్లు డిసిఓకు ఫిర్యాదు చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత నెల 28న లిఖిత పూర్వకంగా తొమ్మిది మంది డైరెక్టర్లు జిల్లా అధికారికి ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిధులస్వాహాపై విచారణ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed