- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఎస్పీ రాజ్యాధికార యాత్ర కోదాడ మండల కన్వీనర్ ఫిక్స్.. ప్రకటించిన పార్టీ ఇంచార్జ్

దిశ, కోదాడ: బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర కోదాడ మండల కన్వీనర్‌గా కాపుగల్లుకి చెందిన చేరుకుపల్లి కిరణ్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ తెలిపారు. కోదాడలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో అతన్ని ఎన్నుకున్నారు. తెలంగాణలో రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశ్యంతో మార్చి 6న బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర తల పెట్టారని రమేష్ అన్నారు. ప్రస్తుతం యాత్ర సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోందని, త్వరలో కోదాడ మండలంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణలో బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉపేందర్, నాగార్జున, యిర్మీయా తదితరులు పాల్గొన్నారు.