Yashwant Sinha: గులాబీ జెండాల కోలాహలం.. ప్రారంభమైన కేసీఆర్, యశ్వంత్ సిన్హా ర్యాలీ

by GSrikanth |   ( Updated:2022-07-02 07:38:20.0  )
KCR and Yashwant Sinha leave to Jalavihar in one vehicle
X

దిశ, వెబ్‌డెస్క్: KCR and Yashwant Sinha leave to Jalavihar in one vehicle విపక్ష పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బేగంపేటకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్ వరకు దాదాపు ఐదు వేల ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, ఒకే వాహనంలో యశ్వంత్ సిన్హా, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ర్యాలీలో పాల్గొనడం టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది.

Next Story

Most Viewed