ఆయనతో 25 మంది పిల్లలను కనాలని ఉంది: యంగ్ హీరోయిన్

by Satheesh |   ( Updated:2022-03-19 12:05:14.0  )
ఆయనతో 25 మంది పిల్లలను కనాలని ఉంది: యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌‌తో వెలుగులోకి వచ్చిన తేజస్వీ ప్రకాశ్‌-కరణ్‌ కుంద్రా లవ్‌ జర్నీ గురించి ప్రేక్షకులకు తెలిసిందే. కాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ కుంద్రా.. పెళ్లి సంగతి పక్కనపెట్టి పిల్లల గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త కంటే కూడా మంచి తండ్రి అవ్వాలని ఉందన్న కరణ్.. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, ముందుగా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అంతేకాదు ఎక్కవమంది పిల్లలతో ఆడుకోవడం సరదాగా ఉంటుందన్న నటుడు.. తేజస్వీ 25 మంది పిల్లలను కనాలని చెప్పిందని పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు.

లిప్‌లాక్‌కు సిద్ధమైన శ్రీదేవి కూతుళ్లు.. బోల్డ్ పిక్ వైరల్

Next Story

Most Viewed