- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. 'నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించే బాధ్యత దక్కడాన్ని గర్వంగా భావిస్తున్నా. గత ఐదేళ్ల కెప్టెన్సీ ప్రయాణం నాకు సంతోషాన్ని, గర్వాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కి గర్వకారణమైన టెస్టు ఫార్మాట్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని గర్వంగా భావిస్తున్నా. నా తర్వాతి సారథి, టీమ్ మేట్స్, కోచ్‌లకి అన్ని విధాల సాయం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా..' అంటూ తన ప్రకటనలో రూట్ తెలియచేశాడు.
కాగా, ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 0-1 తేడాతో ఓటమిపాలైంది. 2017లో కుక్ రాజీనామా తర్వాత రూట్‌ను ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా నియమించారు. 2018లో అతడి సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డ మీద భారత్‌ను 4-1 తేడా ఓడించింది. 2019-20లో సౌతాఫ్రికా గడ్డ మీద సిరీస్‌ను 3 -1 తేడాతో గెలుచుకుంది. కానీ ఆస్ట్రేలియాతో చేతిలో 0-4 తేడాతో చిత్తుగా ఓడింది. గత వేసవిలో న్యూజిలాండ్, భారత్ చేతుల్లోనూ ఓటమి చవి చూసింది. రూట్ నాయకత్వంలో ఆడిన చివరి 17 టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే విజయాన్ని అందుకుంది. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమితోపాటు.. వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడాన్ని రూట్ జీర్జించుకోలేకపోయాడు. అంతేగాక, కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలనే డిమాండ్ సైతం తీవ్రమైంది. దీంతో కరేబియన్ దీవుల నుంచి స్వదేశం చేరుకున్న అనంతరం రూట్ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.