- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన జగ్గారెడ్డి
దిశ, సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి నియోజక వర్గం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లోజీరో అవర్ సమయంలో నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. అందులో ప్రధానంగా.. పోలీస్ శాఖ పనితీరుతో పాటు, వ్యవసాయ శాఖ సివిల్ సప్లైకి సంబంధించి ప్రజా సమస్యలను ఆయా మంత్రుల దృష్టికి తీసుకచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు.
సంగారెడ్డిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే సంగారెడ్డి హెడ్ క్వాటర్ కు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో హోం మంత్రి మహమూద్ అలీని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2టౌన్ పోలీస్ స్టేషన్‌లు పెంచాలన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉన్నదని, ఇక్కడ మరో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొంతమంది పోలీసుల పనితీరు మారాలి..
తెలంగాణ పోలీస్‌లు మంచి ఫ్రెండ్లీ పోలీస్‌లే కానీ, అందులో కొందరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పోలీసులు ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఇందులో కొంతమంది పోలీసులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపోతే సంగారెడ్డి జిల్లా జైలులో పోలీసులు సంఖ్యని పెంచాలని కోరారు. జైలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వారికి లోకల్‌గా సొంత జిల్లాలో పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. అలాగే స్థానికంగా సొంత జిల్లాలో పోస్టింగ్‌లు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అసెంబ్లీలో జగ్గారెడ్డి వ్యక్తపరిచారు. కొన్ని జిల్లాలో స్థానికంగా గంజాయి అమ్మకాలతో సంబంధం ఉన్నవారిని ఎస్ఐ,సీఐ లెవల్‌లో కొందరు (అందరూ కాదు) ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇది ప్రమాదమన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీసుల వల్ల పీడీ యాక్ట్ వేసి ఉన్నవారికి కూడా బెయిల్ దొరుకుతుంది ఇది గమనించలన్నారు పేర్కొన్నారు. గంజాయి తో సంబంధం ఉన్నవారి గురించి లోకల్ పోలీసులకు చెప్పడానికి మేము ఆలోచూస్తున్నాం .. ఎందుకంటే కొందరు పోలీసులు అలాంటివారితో స్నేహంగా ఉంటున్నారు. ప్రత్యేక పోలీసులను పెట్టి ఇది అరికట్టాలన్నారు.
వరితో పాటు చెరుకు పంట కు ప్రాధాన్యత ఇవ్వాలి..
సంగారెడ్డి జిలాలలో వరితో పాటు క ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వ్యవసాయ శాఖ దీనిపై దృష్టి సారించి ఈ రెండిటికీ ప్రాధాన్యత ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. చెరుకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని, జహీరాబాద్ , మెదక్ ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు మూతబడి ఉన్నాయని తెలిపారు. దీంతో జహీరాబాద్, మెదక్ ప్రాంతం నుంచి కూడా చెరుకు రైతులు గణపతి షుగర్ ఫ్యాక్టరీ కే రావాల్సి వస్తుందని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేస్తే చెరుకు రైతులకు ఇబ్బంది ఉండదన్నారు. అలాగే చెరుకు పంటకు మద్దతు ధర ఇచ్చే అంశం పై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం కోసం అక్కడి ప్రాంత రైతుల భూమి ప్రభుత్వం తీసుకుందన్నారు. పరిహారంగా అదే కళాశాలలో భూమి కోల్పోయిన రైతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ, భూమి ఇచ్చిన 10 మంది రైతుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు అన్ని సరుకులు అందించాలి
అసెంబ్లీలో సివిల్ సప్లైస్ పై జరిగిన చర్చలో మాట్లాడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం ఇస్తున్నారని తెలిపారు. కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు ఆయిల్, షుగర్, కిరోసిన్, కారం, ఉప్పు , పప్పు ,చింతపండు ఇతర నిత్యావసర వస్తువులు ఇస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసని, అందుకే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. పై మూడు శాఖలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల మంత్రులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.