- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయనతో పని చేయడమంటే చాలా ఇష్టం.. జాక్వెలిన్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఎటాక్: పార్ట్ 1'. ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదల కానుండగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాక్వెలిన్.. జాన్ అబ్రహం నటన, సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'సరికొత్త కథతో వస్తున్న 'ఎటాక్-1' అభిమానులకు అట్రాక్ట్ చేస్తుంది. ఇండియాలో తెరకెక్కిన తొలి సూపర్ సోల్జర్ సైన్స్ ఫిక్షనల్ స్టోరీలో నటించే చాన్స్ రావడం సంతోషంగా, గౌరవంగా ఉంది.
జాన్ అబ్రహంతో కలిసి పనిచేయడం సరదాగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. సినిమా కోసం జాన్ చేసే హార్డ్ వర్క్, కమిటిమెంట్ నాకెంతో ఇష్టం' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీని పెన్ స్టూడియోస్, జెఏ ఎంటర్టైన్‌మెంట్, అజయ్ కపూర్ ప్రొడక్షన్ సమర్పణలో డాక్టర్ జయంతిలాల్ గడా, హీరో జాన్ అబ్రహం, అజయ్ కపూర్ నిర్మించగా లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. కాగా ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా కీలక పాత్రల్లో నటించారు.