- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ జెండాను అక్కడ ఎగరవేయడమే నా ఆశయం: ఈటల రాజేందర్
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం కేంద్రంలో బీజేపీ పార్టీ మండల శాఖఆధ్వర్యంలో మాజీ ఎంపీ జంగారెడ్డి సంతాపసభ స్థానిక ఎస్‌వీకేకే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. జంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. జంగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. జంగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలన్నది తన ఆశయమని తెలిపారు. దీని కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బీజేపీ జెండాను రాష్ట్ర రాజధానిపై ఎగిరే వేయాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డి స్మృతులు పుస్తకరూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి, కిసాన్ సంగ్ జిల్లా అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు రాయల మొగిలి, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు రవి కిరణ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామ సర్పంచులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.