- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-52: రేపే శ్రీహరికోట నుంచి ప్రయోగం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ52ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయమే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దాదాపు 25 గంటల కౌంట్ డౌన్ తర్వాత ప్రయోగాన్ని చేపట్టనున్నారు. కాగా, ఈ ప్రయోగంలో 1170 కిలోల బరువున్న ఈఓఎస్-4 తో పాటు, రెండు చిన్న ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. గతేడాది ఈఓఎస్-03 తో తీసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్10 సాంకేతిక కారణాలతో విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అలా జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈఓఎస్-4 ఉపగ్రహం ద్వారా అటవీ మొక్కల పెంపకం, వ్యవసాయం, విపత్తును పసిగట్టడం తో పాటు క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన చిత్రాల ద్వారా సమాచారం అందించనున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టనున్న తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఇది విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం విశేషం.