- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఓబీతో కలిసి ఐఆర్‌సీటీసీ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు!
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్(బీఎఫ్ఎస్ఎల్), ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా కొత్తగా రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. దీని ద్వారా తరచూ రైలు ప్రయాణం చేసే వినియోగదారులకు గరిష్ట మొత్తంలో ఆఫర్లు అందించేందుకు రూపొందించబడింది. అలాగే ఐఆర్‌సీటీసీ వినియోగదారులు బీఓబీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏదైనా ఏసీ రైల్వే టికెట్‌ను బుక్ చేసుకునే తక్కువ ధరలో లభించనున్నాయి. అంతేకాకుండా ఈ కార్డును ఉపయోగించి కిరాణా నుంచి పెట్రోల్ వరకు షాపింగ్ చేసుకునేలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
'ఐఆర్‌సీటీసీ బీఓబీ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఏసీ లేదా ఎగ్జిక్యూటివ్ టికెట్ కొంటే ప్రతి రూ .100కు గరిష్ఠంగా 40 రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఇది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి బుక్ చేసుకున్నవారికి వర్తిస్తుంది. అలాగే, కార్డు జారీ చేసిన 45 రోజుల్లోగా రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లను నిర్వహించిన వినియోగదారులకు 1,000 బోనస్ రివార్డు పాయింట్లు లభిస్తాయని' ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, ఎండీ రజనీ హసిజా వెల్లడించారు. కాగా, రైల్వే ప్రయాణం చేసేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది.
అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాల్సిన సమయంలో తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకునేందుకు సరికొత్తగా యాప్‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. 'కన్ఫర్మ్ టికెట్' పేరుతో తెచ్చిన ఈ యాప్ నుంచి అనుకోని సందర్భాల్లో అత్యవసరంగా రైలు ప్రయాణం చేసే వారు టికెట్ కొనేందుకు వీలవుతుంది. ఈ యాప్‌లో రైళ్లలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలతో పాటు ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన మార్గంలో తత్కాల్ టికెట్‌ల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. అంతేకాకుండా రైళ్ల వివరాలను తెలుసుకునేందుకు ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పనిలేదు.