- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva-2 పై కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), శివ కాంబోలో వచ్చిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్(Studio Green), యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. అయితే నైజాం ఏరియాలో మైత్రీ మూవీ(Mythri Movie Makers) డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ‘కంగువ’ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘కంగువ(Kanguva) సినిమాకు మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటున్నా.
తమిళ్ కంటే తెలుగులో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. సూర్య సినిమాల్లో టిల్ డేట్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది. ఆయన చేసిన రెండు డిఫరెంట్ రోల్స్ కు మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. ఈ మూవీ కోసం సూర్య పడిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. నటనకు ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందిస్తున్నారు. అయితే ‘కంగువ-2 సినిమాలో దీపిక పడుకొణె(Deepika Padukone)ను హీరోయిన్‌గా తీసుకుంటున్నామనే విషయంలో నిజం లేదు.
ఇంకా ఆ మూవీ వర్క్ స్టార్ట్ చేయలేదు. డైరెక్టర్ శివకు అజిత్‌తో ఓ మూవీ చేయాల్సిన కమిట్ మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ-2’ వర్క్స్ బిగిన్ చేస్తాం. ఈ సినిమా ప్రమోషన్ కోసం నెల రోజులకు పైగా నిద్రలేకుండా వివిధ ప్రాంతాలకు ట్రావెలింగ్, ఈవెంట్స్ లో పాల్గొంటున్నాం. ప్రస్తుతం కార్తితో మా స్టూడియో గ్రీన్ లో చేస్తున్న వా వాతియర్(Vaa Vaathiyaar) జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ఆ సినిమా తర్వాత మా సంస్థలో చేసే కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.