- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. ప్రపంచవ్యాప్తంగా 10 మందిలోనే..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని భారత్ లో గుర్తించారు. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిని 65 ఏళ్ల వ్యక్తిలో 'ఈఎంఎం నెగిటివ్' చెందిన గ్రూపు అని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచంలో ఈ తరహా బ్లడ్ గ్రూపు కలిగిన పదో వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. అంతేకాకుండా భారత్ లో ఈ గ్రూపు బ్లడ్ ఉన్న వ్యక్తి ఈయన మాత్రమే. కాగా, ఈ బ్లడ్ గ్రూప్ సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ లా కాకుండా ప్రత్యేకమైనది. సాధారణంగా, మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, ఓ, ఆర్ హెచ్, డఫ్పీ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అయితే ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులు రక్తం దానం చేయడం కానీ, ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదు. గుండెకు సంబంధించిన సర్జరీ కోసం చేసిన పరీక్షల్లో ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడింది. రక్తంలో ఈఎంఎం లేకపోవడం వల్ల, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్‌బీటీ) దీనికి ఈఎంఎం నెగిటివ్‌గా పేరు పెట్టింది.