Wi-Fi సిగ్నల్‌ని ఇలా మెరుగుపరుచుకొండి

by Harish |
Wi-Fi సిగ్నల్‌ని ఇలా మెరుగుపరుచుకొండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో, ఇంటర్నెట్ లేకుండా ఎవరు ఉండలేరు. మనకు ప్రతిరోజు నెట్ అవసరం అవుతుంది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వలన ఇంట్లో కూడా Wi-Fi రూటర్‌ ఉండటం చాలా అవసరం. Wi-Fi సిగ్నల్ అన్ని సమయాల్లో బాగా రాదు. కొన్నిసార్లు సిగ్నల్ తక్కువగా వస్తుంది. ఇలా సిగ్నల్ తక్కువ కారణంగా పనిలో అంతరాయం కలుగుతుంది. తక్కువ వచ్చే సిగ్నల్ స్ట్రెంగ్త్‌ను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

- స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం.

స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi సిగ్నల్ తక్కువగా ఉంటే, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఉత్తమం.

- Wi-Fi రూటర్‌ని రీస్టార్ట్ చేయడం.

మీ స్మార్ట్‌ఫోన్ Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ కాకపోతే లేదా సిగ్నల్ నిరంతరం పడిపోతుంటే, Wi-Fi రూటర్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి. దాన్ని అన్‌ప్లగ్ చేసి, కనీసం 10-15 నిమిషాల తర్వాత Wi-Fi ని రీస్టార్ట్ చేయండి.

- అడ్డంకులను తొలగించడం.

సిగ్నల్‌ పెంచడం కోసం రూటర్, స్మార్ట్‌ఫోన్ మధ్య అడ్డంకిని తొలగించాలి. ఫర్నిచర్ లేదా వస్తువులను రూటర్ నుండి దూరంగా తరలించాలి. రూటర్‌కి దగ్గరగా వెళ్లడం ద్వారా కూడా మెరుగైన సిగ్నల్ పొందవచ్చు. రూటర్‌ను ఎత్తైన ప్రదేశంలో ఉంచడం వలన సిగ్నల్ స్థాయి పెరిగే అవకాశం ఉంది.

-Wi-Fi నెట్‌వర్క్‌ ఐడి, పాస్‌వర్డ్‌.

సేవ్ చేసిన Wi-Fi నెట్‌వర్క్ ఐడి, పాస్‌వర్డ్‌ను మార్చడం వలన సిగ్నల్ స్ట్రెంగ్త్‌ను మెరుగుపరచవచ్చు.

- స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రీసెట్ చేయడం.

స్మార్ట్‌ఫోన్ అన్ని సెట్టింగ్‌లను రీసెట్ చేయడం ద్వారా సేవ్ చేయబడిన Wi-Fi నెట్‌వర్క్‌లు, బ్లూటూత్ పరికరాలు, హోమ్ స్క్రీన్ లేఅవుట్ వంటి సెట్టింగ్‌లు రీసెట్ చేయబడతాయి. ఇది మెరుగైన Wi-Fi కనెక్షన్‌ని పొందడానికి ఉపయోగపడుతుంది.

- రూటర్‌ అప్‌డేట్‌.

రూటర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా కూడా సిగ్నల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story