- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై నమ్మకంలేక.. ఆ పుస్తకాలను కొనేవారే లేరు..
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ ఖాళీలు 80,039 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరం నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించినా స్టడీ మెటీరియల్కొనేందుకు ఏ మాత్రం మొగ్గు చూపడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్గతంలోనూ త్వరలో నోటిఫికేషన్అంటూ ఊదరించడమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు కేసీఆర్‌మాటలు నమ్మి పుస్తకాలు కొని ఆర్థికంగా నష్టపోయినట్లుగా యువత వాపోతున్నారు. యువత కొనేందుకు ముందుకు రాకపోవడంతో వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి త్వరలో నోటిఫికేషన్అని చెప్పడంతో కొంత స్టాక్‌ను కూడా తెప్పించుకున్న వ్యాపారులు.., నిరుద్యోగులు స్టడీ మెటీరియల్ ను కొనుగోలు చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగట్లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.
నోటిఫికేషన్అనగానే గ్రామాల నుంచి చాలా మంది యువత పట్టణానికి చేరుకున్నారు. నోటిఫికేషన్ఎప్పుడొచ్చినా ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని రెడీ అయినా స్టడీ మెటీరియళ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదు. గతంలో తమ వద్ద ఉన్న మెటీరియల్నే వినియోగించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే హాస్టల్ఫీజు, మెస్‌చార్జీల మోతతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వాపోతున్నారు. దీనికి తోడు కొవిడ్‌కారణంగా నిరుపేదలు ఆర్థికంగా కష్టాల ఊబిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచే ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న పేరెంట్స్ను మరింత ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా లేమని కొందరు వాపోతున్నారు. అయితే ఒక వర్గం నిరుద్యోగులు మాత్రం అప్పు చేసి అయినా సరే.. ఉద్యోగం కొట్టాలని కసితో ప్రిపేర్అవ్వాలని భావిస్తుండగా నోటిఫికేషన్వచ్చాక కొందామని ఇంకొందరు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వేయకుంటే మళ్లీ నష్టపోతామని, ఇప్పుడే కొని డబ్బులు ఎందుకు వృథా చేసుకోవాలని యువత వేచి చూసే ధోరణిని కనబరుస్తోంది.
ఏ జాబ్నోటిఫికేషన్కు సంబంధించిన స్టడీ మెటీరియల్అయినా అన్నీ ఒకేచోట దొరికే ప్రాంతం కోఠి. కొవిడ్సమయం నుంచి అటు విద్యాసంస్థలు లేక, ఇటు నోటిఫికేషన్లు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న కేసీఆర్నోటిఫికేషన్ప్రకటన చేసిన వెంటనే కొందరు వ్యాపారులు అప్పు తెచ్చి మరీ మెటీరియల్స్తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అనే అనుమానం కారణంగా నిరుద్యోగులు ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. ఇప్పటికే ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులు ఈసారి కూడా నిజంగా నోటిఫికేషన్వేస్తారో లేదోనని ధైర్యం చేయడంలేదని వాపోతున్నారు. అయితే గ్రామాలకు పరిమితమైన నిరుద్యోగులు క్రమంగా పట్టణానికి వస్తుండటంతో మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిగా చేరుకుంటే కొనుగోళ్లు జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము తెచ్చిన అప్పు రోజురోజుకూ పెరిగిపోతోందని, వ్యాపారం మాత్రం సాగడంలేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
నోటిఫికేషన్ఎప్పుడొస్తుందో తెలియదు
సీఎం కేసీఆర్‌మాటలు విని ఇప్పటికే చాలాసార్లు మోసపోయాం. అసలు నోటిఫికేషన్ఎప్పుడొస్తుందో తెలియదు. ఎన్ని పోస్టులకు వేస్తారో తెలియదు. ఎలాంటి గైడ్లైన్స్కూడా లేవు. ఇప్పటికే చాలాసార్లు మెటీరియల్స్కొని ప్రిపేర్అయ్యాం. కానీ నోటిఫికేషన్లు వేయకుండా మోసం చేశారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్అసెంబ్లీ సాక్షిగా నోటిఫికేషన్భర్తీ అన్నారు.. ఆయనను మళ్లీ నమ్మేదెలా?
అమరేందర్, నిరుద్యోగి
కొనేందుకు ఆసక్తి చూపట్లేదు
నోటిఫికేన్లు అని స్వయంగా సీఎం కేసీఆర్అని ప్రకటించడంతో అప్పు చేసి మరీ మెటీరియల్తీసుకొచ్చా. ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదు. ఇంకో వారం, పది రోజుల్లో అయినా కొనుగోళ్లు జరుగుతాయేమో చూస్తాం. ప్రతి రోజు షాపునకు వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కొనుగోళ్లు లేక వడ్డీ పెరుగుతోంది.
యూసుఫ్, వ్యాపారి