1972నాటి బ్రిడ్జి.. మూడు రోజుల్లో మాయం చేసిన దొంగలు

by Manoj |
1972నాటి బ్రిడ్జి.. మూడు రోజుల్లో మాయం చేసిన దొంగలు
X

పాట్నా: బీహార్‌లో ఆశ్చర్యకరమైన దొంగతనం చోటుచేసుకుంది. రోహ్తాస్ జిల్లాలో పగటిపూట నీటి పారుదల శాఖ అధికారులమని చెప్పి ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లారు. అధికారులమని స్థానికులకు చెప్పి గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలు ఉపయోగించి బ్రిడ్జిని తొలగించి దర్జాగా తీసుకెళ్లారు. మూడు రోజుల్లో బ్రిడ్జిని లేకుండా చేశారు.

దీనిపై నీటిపారుదల జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ శాంసీ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు నీటిపారుదల శాఖ అధికారులమని చెబుతూ, జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహయంతో బ్రిడ్జిని తొలగించారని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి కనిపించకుండా పోవడం అందరిని షాక్‌కు గురిచేసిందని అన్నారు. 1972లో ఈ వంతెనను అర్ర కెనాల్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన నిరూపయోగంగా ఉంది. ప్రమాదకర వంతెనగా ప్రకటించిన అధికారులు, తొలగించడంపై సాగదీస్తూ వచ్చారు. ఇంత పొడవైన బ్రిడ్జిని ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district

Advertisement

Next Story

Most Viewed