ఇమ్రాన్‌ను సైకోపాత్‌లా చూడాలి: మాజీ ప్రధాని కూతురు

by Javid Pasha |
ఇమ్రాన్‌ను సైకోపాత్‌లా చూడాలి: మాజీ ప్రధాని కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ ప్రధాని కూతురు సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడిని ప్రధాని, మాజీ ప్రధానిగా చూడకూడదని ఆమె అన్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం షరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌ను పొగిడినందుకు.. అంతగా నచ్చితో అక్కడికే వెళ్లమంటూ ఇమ్రాన్‌కు ఉచిత సలహాలు ఇచ్చింది. అయితే ఆమె తాజాగా తన సరికొత్త ట్వీట్‌తో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. 'తన సృహలో లేని మనిషి దేశాన్ని నడిపించలేడని, అతడి చేతిలో దేశాన్ని పెట్టి దేశంలో విధ్వంసం, దేశ పతనానికి తావు ఇవ్వం' అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది.

అంతేకాకుండా 'ఎవరైతే తమను కాపాడుకునేందుకు తమ దేశాన్నే బందీగా మార్చే వారిని సృహలో ఉండరో వారు పీఎం, మాజీ పీఎం‌గా పరిగణించబడరని, వారిని కేవలం మతి స్థిమితం లేని సైకోపాత్‌లా మాత్రమే పరిగణించాలి' అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ట్విటర్ వేదికగా ఆమె సంధిస్తున్న అస్త్రాలు పాకిస్తాన్‌ అంతటా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం సరిగ్గా సమాధానం చెప్తున్నావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story