- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాప్రా సర్కిల్‌లో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు!
దిశ, కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాప్రా సర్కిల్ పద్మశాలి టౌన్ షిప్ లో బిల్డర్లు రెచ్చిపోయి అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇక్కడి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు అండగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిలుస్తుడంటంతో యథేచ్ఛగా అదనపు అంతస్థుల నిర్మాణాలు, నిబంధలకు విరుద్ధంగా కమర్షియల్ షెటర్లతో సెట్ బ్యాక్ లు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్కిల్ పరిధిలోని కాప్రా, చర్లపల్లి, ఎఎస్ రావునగర్ డివిజన్‌ల పరిధిలో అక్రమ నిర్మాణాల తంతు కొనసాగుతుంది. ఇందుకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుషాయిగూడ వాసవి శివనగర్ కమాన్ వద్ధ వెలుస్తోన్న నిర్మాణాన్ని అధికారులు కూల్చివేసినా యథేచ్ఛగా తిరిగి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. కాప్రా నేతాజీ నగర్ చౌరస్తా నుంచి కాప్రా చెరవు వైపు వెళ్లే దారిలో అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం వెలిసింది.
ఇక్కడ అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం కొనసాగుతుందని పలు ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. హుటాహుటిన రాత్రికి రాత్రే షెడ్ నిర్మాణ పనులను పూర్తి చేసుకుని వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించినా అధికారుల్లో చలనం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో అక్రమ నిర్మాణదారులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.