- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యదేచ్చగా అక్రమ ఇసుక దందా.. నిద్రావస్థలో అధికార యంత్రాంగం
దిశ, కోటపల్లి: మండలంలోని కొల్లూరు, బోరంపల్లి ఇసుక రీచ్ లలో ఇసుక అక్రమ దంద మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది .అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం తో అడిగే వారు లేక ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు .ఇక్కడ లభించే ఇసుక నాణ్యత కలిగి ఉంటుంది. దీనికి మంచి గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ ఇసుకను అనుమతులకు మించి తోడేస్తున్నారు.
నిబంధనలను అతిక్రమించి తవ్వకాలు
సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 నుండి 5 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి తియ్యాలి. అలా కాకుండా ఇష్టారాజ్యాంగ 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు తవ్వుతున్నారు.అంతేకాకుండా ఇసుక ఉందికదా అని కింద భూమి వచ్చేవరకు తవ్వకాలు జరుపుతున్నారు.దీనివల్ల నీరు నిలువ ఉండి లోతు తెలియక ఇలాంటి గుంతలలో చనిపోయిన వారు కూడా ఉన్నారు.
ఒక రీచ్‌కి పర్మిషన్ ఉంటే అన్ని రీచ్‌లను నడపడం
పర్మిషన్ ఉన్న రీచ్‌లను మాత్రమే నడపాలి .అనుమతులు లేని రీచ్‌లను నడిపించే వారిపై చట్టరీత్య చర్య లు తీసుకోవాలి. కానీ అధికారులతో కుమ్మక్కై వారికి నెలకు కొన్ని డబ్బులు ముట్టజెప్పి ఒక్క రీచ్ కి పర్మిషన్ ఉన్నా అన్ని రీచ్ లలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు .ఈ విషయమై స్థానికులు ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వే బిల్ లేకుండా జీరో బిల్ తో ఇసుక దందా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వే బిల్ లేనిది ఇసుక రవాణా చేయడానికి వీలు లేదు .కానీ అడిగే వారు లేకుంటే అన్ని నావేఅన్నట్టు ప్రతి రోజూ జీరో దందా సాగుతుంది .మహారాష్ట్ర సరిహద్దు కావడం ఇక్కడి ఇసుక కి మంచి గిరాకీ ఉండటంతో జీరో దందా ప్రతిరోజూ సాగుతుంది .ఈ దందా చేసేవారు అధికారులకు చిన్న అధికారి నుండి పెద్ద అధికారి వరకు నెలకు లక్షల్లో అప్పచెప్పి దందా చేసుకుంటున్నారు.
వే బిల్ కాంట దగ్గర తమకు ఎంత అనుమతి ఉందో అంత వే బిల్ కొట్టించుకొని వే బిల్ కన్నా ఎక్కువ ఇసుకను పట్టణాలకు తరలించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నరు. ఇలా అధికారులకు డబ్బులు అప్ప చెప్పడం వల్ల వారు అంతంత మాత్రంగా తనిఖీలు చేసి పేరుకు తనిఖీ చేశామని చెబుతున్నారు. ఇలా అధికారులకు నెలకు కొన్ని డబ్బులిచ్చి అధికారులను బానిసలుగా చేసుకున్నారని పలువురు చెబుతున్నారు.
ఇలా అక్రమంగా ఇసుకను తవ్వడం పై మైనింగ్,TSMDC, రెవెన్యూ, పోలీసు అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ వీరందరి నెలసరి చేతివాటం వల్ల అక్రమ తవ్వకాలు, అక్రమ ఇసుక దందా, 0 దందా జోరుగా సాగుతోందని ప్రచారం సాగుతోంది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అంతంత మాత్రంగా వచ్చి వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు ఫోటోలు దిగి వెళ్లిపోవడం రొటీన్ గా సాగుతుంది. ఇంత అక్రమ దందా జరిగిన ఇప్పటివరకు ఏ ఒక్క వాహనాన్ని కూడా పట్టుకు లేదంటే అధికారులు ఎంతటి నిద్రావస్థలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా నిద్రవస్తను వదిలి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.