PAN - Aadhaar మార్చి 31లోపు లింక్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా!

by Harish |   ( Updated:2022-03-31 11:06:57.0  )
PAN - Aadhaar మార్చి 31లోపు లింక్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్-ఆధార్ లింకింగ్ చేసుకొవాలని కేంద్రం చాలా సార్లు చెప్పింది. ఇప్పటికే కరోనా కారణంగా చివరి గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ చివరి తేదీ రానే వచ్చింది. మార్చి 31, 2022లోపు ఆధార్ నంబర్‌తో పాన్ లింక్ చేసుకొవాలని కేంద్రం చెప్పింది. లేకపోతే అదనంగా చార్జీలు విధిస్తామని పేర్కొంది.

గడువు తేదీలోపు ఆధార్ నంబర్‌తో పాన్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1, 2022 నుంచి మూడు నెలల వరకు రూ. 500 జరిమానా, ఆ తర్వాత రూ. 1,000 రుసుము విధిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫైన్ విధింపుతో పాటు లింక్ చేయని PAN మార్చి 31, 2023 వరకు పని చేస్తుందని తెలిపింది.

* ఆధార్‌తో లింక్ చేయని PAN, మార్చి 31, 2023 తర్వాత "పనిచేయదు".

* పాన్ పని చేయని కారణంగా పాన్‌ని ఉపయోగించి రిటర్న్‌ను ఫైల్ చేయలేరు.

* పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లు కూడా ప్రాసెస్ చేయబడవు

* PAN పనిచేయని కారణంగా ఎలాంటి లావాదేవీలు చేయలేరు.

* అన్ని ఆర్థిక లావాదేవీలకు KYC ముఖ్యం కాబట్టి, బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద ఇబ్బందులు వస్తాయి.

Advertisement

Next Story

Most Viewed