మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేజ్రీవాల్

by Mahesh |
మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేజ్రీవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం బీజేపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని బీజేపీ కి సవాల్ విసిరారు. ఎంసీడీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీ కి పట్టుకుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఎంసీడీ ఎన్నికల వాయిదా పై కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. కాషాయ పార్టీ ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించి, వాటిని గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ( కేజ్రీవాల్) రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఢిల్లీలో ఉత్తర, తూర్పు, దక్షిణాది అనే మూడు పౌర సంఘాలు ఏకం చేసే బిల్లుకు మంగళవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story