నా ఇష్టం ఎలాగైనా తిరుగుతా.. నటి స్టేట్‌మెంట్

by S Gopi |   ( Updated:2023-10-10 16:42:18.0  )
నా ఇష్టం ఎలాగైనా తిరుగుతా.. నటి స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గ్లామర్ షో గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనిలేదు. ఇన్‌స్టాలో తను పెట్టే ఒక్కో పోస్ట్‌ నిమిషాల్లో వైరల్ అవుతుందంటేనే ఆమెకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. డిఫరెంట్ డ్రెస్సింగ్, విచిత్ర హెయిర్‌ స్టైల్స్‌తో నిత్యం వార్తల్లో ఉండే ఉర్ఫీ.. అప్పుడప్పుడు నెటిజన్ల పిచ్చి కామెంట్స్‌కు బలవుతుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన డ్రెస్సింగ్‌పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ను ఉద్దేశించి తాజాగా రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 'నేను తిరుగుతాను, గెంతుతాను, ఎవరితోనైనా ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తాను. లేదంటే ఒంటరిగానే ఉంటాను. ఆడతాను, పాడతాను.. మీకేంటి నొప్పి' అని ప్రశ్నిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'మేం చూసేందుకే కదా నువ్వు ఇన్ని వేషాలేస్తోంది. అలాంటప్పుడు మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మీకెందుకు అంటున్నావు ఎందుకు' అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.



Next Story