ఆ ప్లేస్‌లోనే చనిపోవాలని కోరిక.. షారుక్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-18 14:11:23.0  )
ఆ ప్లేస్‌లోనే చనిపోవాలని కోరిక.. షారుక్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన ప్రజెంట్ ‘కింగ్’ (King)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా, ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ (Shah Rukh Khan)ఆసక్తికర కామెంట్స్ చేశారు. జీవితాంతం ఇండస్ట్రీలో ఉంటారా లేక ఇతర రంగంలోకి వెళతారా? అని యాంకర్ అడగ్గా.. షారుక్ స్పందిస్తూ.. చనిపోయే వరకు సినిమాల్లోనే ఉంటాను. నేను ఏదైనా మూవీ షూట్‌లో ఉన్నప్పుడు యాక్షన్ అని చెప్పగానే చనిపోవాలి. మళ్లీ వాళ్లు కట్ చెప్పినా కానీ నేను లేవకూడదు అదే నా కోరిక’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

అలాగే స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ.. ‘‘స్టార్‌డమ్‌ను గౌరవిస్తాను కానీ దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. అభిమానుల ప్రేమ, ఆదరణ, గర్తింపు, డబ్బులు వస్తాయి. అందుకు నా కుటుంబం కూడా సంతోషంగా ఉంది. అయితే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అని అనుకుంటున్నా. నా జోకులతో ప్రేక్షకులను నవ్వించగలను కానీ వారికి అర్థం అవుతాయో లేదో అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే.. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది సున్నితంగా ఉన్నారు. మనం ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే బెటర్’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story