- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెక్ టిప్: నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు!
దిశ, ఫీచర్స్ : పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా మిలియన్ యూజర్స్ ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఏదైనా అవసరం పడితే అన్‌నోన్ పర్సన్‌కు మెసేజ్ చేయాల్సి వస్తే ఆ నంబర్ కచ్చితంగా సేవ్ చేయాల్సి వస్తోంది. ఒక్క మెసేజ్ కోసం నంబర్ సేవ్ చేయడం అనేది వాట్సాప్ డ్రా బ్యాక్‌లో ఒకటి కాగా.. ఆ పర్సన్ మన స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్ చూడడం ద్వారా ప్రైవసీ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే నంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ సెండ్ చేసేందుకు ఓ 'టెక్ టిప్' కూడా ఉంది. కేవలం ఒక్క లింక్ ద్వారా ఈ పని పూర్తి చేసేయొచ్చు.
టన్నుల కొద్దీ కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్న వాట్సాప్.. ఇలాంటి కొన్ని యూజ్‌ఫుల్ ఫీచర్స్ తీసుకురావడంలో మాత్రం ఫెయిల్ అయింది. ఇందులో ఒకటి సేవ్ చేసుకోలేని నంబర్‌కు డైరెక్ట్ మెసేజ్ చేసే అవకాశం లేకపోవడం. అయితే కొన్ని ఎక్స్‌ట్రా స్టెప్స్‌తో ఈ డ్రా బ్యాక్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా అధిగమించొచ్చు. అయితే ఇదంతా టైమ్ టేకింగ్ అనిపించొచ్చు కానీ వన్ మినిట్ కన్నా తక్కువ టైమ్‌లోనే పూర్తవుతుంది.
Step 1 : మీ స్మార్ట్ ఫోన్‌లోని బ్రౌజర్‌ను ఓపెన్ చేసి 'https://wa.me/' అని టైప్ చేయాలి..
Step 2 : ఆ తర్వాత మీరు చాట్ చేయాలనుకుంటున్న నంబర్‌ను టైప్ చేయాలి (Example : "https://wa.me/991125387")
Step 3 : ఇప్పుడు కంటిన్యూ అని ఓ గ్రీన్ బాక్స్ స్క్రీన్‌పై అప్పియర్ అవుతుంది. దీనిపై ప్రెస్ చేయగానే వాట్సాప్ ఎకౌంట్‌కు రీడైరెక్ట్ చేయబడుతుంది.
దీంతో సదరు నంబర్ పర్సన్‌తో నార్మల్ చాట్ చేయొచ్చు.