- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా టిప్.. సర్వాంగాసనం వేయడం ఎలా?
దిశ, ఫ్యూచర్స్: యోగా అంటే చాలా ఆసనాలు వేయడం మాత్రమే అనుకుంటారు. కానీ యోగాలోని ఆసనాలు మనకు శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆసనాల్లో సర్వాంగాసనం ఒకటి. ఈ ఆసనం వేసే ముందు శవాసనం వేయాలి. తర్వాత నెమ్మదిగా రెండు కాళ్లను పైకి లేపుతూ రెండు చేతులతో నడుముకు సపోర్ట్ ఇవ్వాలి. ఇదే క్రమంలో కాళ్లను పూర్తిగా పైకెత్తి కాలి వేళ్లను బలంగా ఆకాశంవైపు చూపిస్తూ.. భుజాలపై మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. పాదాలు, పిక్కలు, తొడలు, నడుము అన్నీ నిటారుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు కళ్లు మూసుకొని మెల్లగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఆసనం విరమించుకోవడానికి మెల్లమెల్లగా కాళ్లు తలవైపు వాల్చుతూ నడుమును నేలపై ఆనించాలి. తర్వాత కాళ్లు కింద ఆనించి కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ప్రయోజనం
* మెడలోని అవటు గ్రంథిని ఉత్తేజపరచి రక్తప్రసారం పెంచుతుంది.
* స్త్రీలలో ఋతుచక్రంలోని దోషాలను తొలగిస్తుంది.
* ఊపిరితిత్తులకు రక్తప్రసారం సక్రమంగా జరగడం వల్ల వాటి సామర్థ్యం పెరుగుతుంది.
* మూలవ్యాధి, వరిబీజము వంటి వ్యాధులను నివారిస్తుంది.
* జననేంద్రియాల స్వస్థతను పెంచుతుంది.
* పురుషుల్లో నపుంసకత్వాన్ని తొలగిస్తుంది.
స్త్రీలను రాక్షసుల్లా పీక్కుతింటున్నారు.. ఇండస్ర్టీపై నటి షాకింగ్ కామెంట్స్
- Tags
- sarvangasana
- Yoga