అంతా దోచేసిన దొంగ.. ఇంటికొచ్చిన యజమానికి షాక్

by Javid Pasha |
అంతా దోచేసిన దొంగ.. ఇంటికొచ్చిన యజమానికి షాక్
X

దిశ, పరిగి : దొంగకు చెప్పే లాభం అన్నారు వెనకటికి మన పెద్దలు.. కానీ ఈతరం దొంగలు దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది పరిగిలోని ఓ ఇంట్లో జరిగిన ఘటన. పరిగిలోని ఓ కొత్త ఇంట్లో ఏకంగా బోరు మోటారు పైకి తీసి మరీ ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా మోటారు వైరు, బాత్​రూంలోని ట్యాబ్స్​, వాటర్ హీటర్, మ్యాన్‌హోల్ల డొర్‌లు ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మున్సిపల్​పరిధిలోని సాయిరాం కాలనీకి చెందిన ఆలూరి రాఘవెందర్​ తన నూతన గృహానికి హోలీ పండుగ రోజు శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళాడు.

గేటుకు వేసిన తాళం తెరిచి చూడగా ఇంటి మెయిన్​డోర్​ తాళం విరగ్గొట్టి ఉంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లోని వంటగది, బాత్​రూంలలో ఉన్న టాబ్స్, వాటర్ హీటర్, షవర్స్ ఎత్తుకెళ్లాడు. అంతటితో ఆగకుండా మ్యాన్‌హోల్స్ డోర్స్‌ను​ ఎత్తుకెళ్లారు. మరో పెద్ద మ్యాన్‌హోల్​ ఓపెన్​ చేయగా అందులో బోరు కనిపించింది. మోటారు పైప్​ను పైకెత్తి చూడగా పైప్​ పైకి వస్తూనే ఉంది. ఇలాగైతే కుదరదని పది అడుగులు పైకి ఎత్తి పైప్​ను పక్కడ పడేవారు. ఇలా 485 మీటర్ల పైప్​ను రెండు గంటలు దొంగలు శ్రమించి పైప్​ను ముక్కలు ముక్కలుగా కోసి బోరు మోటారును పైకి తీశారు. ఎట్టకేలకు మోటారు పైకి వచ్చింది.


అమ్మో సీఆర్​ఐ మోటార్​ ఇంకేం 35 వేల పైమాటే అంటూ బోరు మోటారు, నల్లాలు, గ్లీజర్​ బాక్స్, మ్యానుహోల్స్ ​అన్నీ మూట కట్టి ఎత్తుకెళ్లారు. వీటితోపాటు రిపేరింగ్​ కోసం తెచ్చిన టైల్స్​ ఇతర సామాగ్రి కూడా ఎత్తుకెళ్లినట్లు వీటన్నింటి విలువ లక్షకు పైగానే ఉంటుందని బాధితుడు ఆలూరి రాఘవెందర్​ తెలిపారు. బోరు మోటారు పైప్​ను కోయడం పక్కన పెట్టడం చూస్తుంటే ఒక్కరితో అయ్యే పని కాదంటూ తప్పనిసరిగా ఇద్దరు, లేదా ముగ్గురు దొంగలు వచ్చి ఉంటారని కాలనీ వాసులు బావిస్తున్నారు. ఈ విషయమై బాధితుడు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామన్నాడు.

Advertisement

Next Story

Most Viewed