- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట.. సజ్జల రామకృష్ణా ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: కేబినేట్‌లో సమూల మార్పులు తప్పవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ మెుత్తాన్ని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సజ్జల మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు.
నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చు..
కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొత్తం పూర్తయ్యిందనీ, దీనిపై ఎప్పుడైనా నోటిఫికేషన్ రావొచ్చునని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టమని, వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకొనే, జిల్లాల విభజన చేసినట్లు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. 90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఒక ప్రాంతం కోసం లక్షల కోట్లా?
ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని సజ్జల రామకృష్ణ ప్రశ్నించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటం ఏమిటని అన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని ఆయన స్పష్టం చేశారు. డెడ్ లైన్ పెట్టి, అభివృద్ధి చేయాలంటే, సాధ్యం అవుతుందా అని నిలదీశారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టే, సీఎస్ అఫడవిట్ దాఖలు చేసినట్లు వివరించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం వివరించారని సజ్జల గుర్తు చేశారు.