అరేయ్ అబ్బాయిలు పెళ్లి చేసుకోండి.. సక్సెస్ అదే వస్తుంది.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-03 10:31:32.0  )
అరేయ్ అబ్బాయిలు పెళ్లి చేసుకోండి.. సక్సెస్ అదే వస్తుంది.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తాజాగా ‘క’(Ka) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రస్తుతం భారీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అయితే కిరణ్ కెరీర్‌లో ఇంత భారీ కలెక్షన్స్ సంపాదించిన మూవీ ఇదే. దీంతో ఈ హీరో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఊహించనంత పెద్ద హిట్ కావడంతో క మూవీ టీమ్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. తాజాగా సక్సెస్ మీట్ కూడా పెట్టారు. అయితే కిరణ్ అబ్బవరం ఈ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో కిరణ్ మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత మంచి జరుగుతుందని అంటారు. కానీ మరీ ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు. ఎవరైనా సక్సెస్ కాకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది’ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ యంగ్ హీరో రీసెంట్‌గా హీరోయిన్ రహస్య గోరఖ్‌(Rahashya Gorak)ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ‘క’ మూవీ ఇంత హిట్ కావడంతో ఈ సక్సెస్‌ క్రెడిట్‌ను తన భార్యకు ఇవ్వడం విశేషం.


Read More..

‘వాడు ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే’.. మెగా హీరో షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story