- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగూడెంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పర్యటన
దిశ,కొత్తగూడెం : కొత్తగూడెంలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పర్యటించారు. మొదట తన తండ్రి గడల సూర్యనారాయణ జ్ఞాపకార్థంగా స్థాపించిన డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుతాయన్నారు. అదే క్రమంలో ఎర్రగుంటకు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన స్పందన నీట్ పరీక్షలో 7000 స్టేట్ ర్యాంక్ పొంది.. టీఆర్ఆర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిందని, ఆర్థిక స్తోమత లేని క్రమంలో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్పందన ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకూ పూర్తి ఖర్చులు భరిస్తామని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. త్వరలో కొత్తగూడెంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.