Health Tips: రాగులు పోషకాహారం మాత్రమే కాదండోయ్.. !!

by Anjali |
Health Tips: రాగులు పోషకాహారం మాత్రమే కాదండోయ్.. !!
X

దిశ, వెబ్‌డెస్క్: రాగుల(ragulu) ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. హై బ్లడ్ ప్రెజర్ తో ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్(Fiber) ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా మేలు చేస్తాయి. అధిక రక్తపోటు(blood pressure) నివారిస్తాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకుంటే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్‌లా తోడ్పడుతాయి. అంతేకాకుండా కాలేయవ్యాధులు(Liver diseases), గుండె బలహీనత(Heart failure), ఉబ్బసం తగ్గించడంలో సహాయపడతాయి. అయితే రాగులు హెల్త్‌కు మంచివి. వీటిలో అనేక ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మందికి తెలుసు కానీ ఈ సీక్రెట్స్ ఎవరికీ తెలియవు. అవేంటో ఇప్పుడూ చూద్దాం..

పూర్వం పెద్దలు కూడా...

చిరు ధాన్యంగా పిలుచుకునే రాగులు ఆహారంలో భాగం చేసుకుంటే కనుక లాభాలు అనేకం అంటున్నారు నిపుణులు. రాగులను పిండి పట్టించి పలు రకాల వంటకాలు చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇక పూర్వం నుంచే పెద్దలు రాగి అంబలి(Rāgi ambali), రాగి సంగటి చేసుకుని తాగేవారు. ప్రస్తుతం రాగులతో రాగి రొట్టె(Rāgi roṭṭe), రాగి మాల్ట్(Rāgi mālṭ) చేసుకుని తింటున్నారు. చాలా ప్రాచుర్యం పొందాయి కూడా. అయితే రాగులు రుచిని, పోషకాలను కలిగి ఉండటమే కాకుండా వీటితో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రాగుల్లో దట్టమైన పోషకాలతో పాటు..

రాగుల్లో విటమిన్లు(Vitamins) అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం(Calcium), ఫైబర్, కార్బోహైడ్రేట్లకు కొదువే లేదు.కాగా రాగుల ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినవారు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. హెల్తీగా ఉంటారు. ఈ మధ్య ఆరోగ్యంగా ఉండటం కోసం రాగి ఇడ్లీ కూడా తయారు చేసుకుని తింటున్నారు. రాగి అంబలి, రాగి మాల్ట్.. ఇలా ఏదో ఒక ఆహార రూపంలో తీసుకుంటే కనుక సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

దంతాల్ని స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు..

రాగులను ప్రతి రోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో కాల్షియం లోపం తగ్గించడంలో మేలు చేస్తాయి. దంతాలు, బోన్స్(Bones) స్ట్రాంగ్‌గా తయారవుతాయి. అలాగే బోన్ ఎముకల వ్యాధి రాకుండా మేలు చేస్తాయి. మధమేహ రోగులు ఒక వరంలా భావిస్తారు. రాగి జావా రోజూ తాగితే షుగర్ లెవల్స్(Sugar levels) కంట్రోల్ లో ఉంటాయి. రాగుల్లో పాలీ ఫెనాల్స్(Polyphenols), డైటరీ ఫైబర్(Dietary fiber) ఎక్కువగా ఉంటాయి. తద్వారా టిఫిన్, లంచ్, డిన్నర్ లో ఏదో ఒక రూపంలో తింటే మాత్రం డయాబెటిస్(Diabetes) కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.

మానసిక ఆరోగ్యానికి చెక్..

అలాగే రాగులు మానసిక ఆరోగ్యానికి(Mental health) కూడా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. రాగులు స్ట్రెస్ రిలీఫ్(Stress relief) నుంచి సహాయపడతాయి. నిరాశ, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. చాలా సేపు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. వెయిట్ లాస్(Weight loss) అవ్వాలనుకునే వారికి రాగులు బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. బరువును తొందరగా తగ్గిస్తాయి. హిమోగ్లోబిన్(Hemoglobin) తక్కువగా ఉన్నట్లైతే ఆసుపత్రికి అడుగులు వేయకుండా రాగుల్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోండి. రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాగా ఐరన్ ఈజీగా డైజేషన్ అయ్యి.. రక్తంలో ఈజీగా కరగుతుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించ గలరు.

Advertisement

Next Story

Most Viewed