pear fruit: రుచిలో మధురమైన పండు.. ఈ వ్యాధులన్నీ పరార్ అవ్వాల్సిందే?

by Anjali |   ( Updated:2025-02-04 08:45:36.0  )
pear fruit: రుచిలో మధురమైన పండు.. ఈ వ్యాధులన్నీ పరార్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అందుతాయి. అలాగే ఫ్రూట్స్ తింటే (immune system) బలంగా ఉంటుంది. వీటితో పాటుగా స్కిన్ ప్రకాశవంతంగా మెరుస్తుంది. పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు(Heart diseases), స్ట్రోక్ (stroke), కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గించడంలో మేలు చేస్తాయి.

అయితే రుచిలో మాత్రమే కాకుండా కొన్ని పండ్లు పలు వ్యాధుల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చాలా మంది టేస్టీగా ఉన్న పండ్లనే ఎక్కువగా తింటుంటారు. ఇంకా కొన్ని పియర్ ఫ్రూట్ (Pear fruit) వంటి వాటిని అయితే తొక్కతో సహా తింటారు.

వీటిలో పోషకాలు దట్టంగా ఉంటాయి. హెల్త్ కు దివ్యౌషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు (Nutritionists) చెబుతున్నారు. పండు తినడం కంటే తొక్క తింటేనే ఆరు రెట్లు పాలీ ఫెనాల్స్ (Polyphenols)ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తోన్న బరువు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. మరీ రుచిలో మాత్రమే కాకుండా హెల్త్ కు ఏ విధంగా మేలు చేస్తుందో నిపుణులు చెప్పినవి తెలుసుకుందాం..

పియర్స్ పండు తింటే పేగు కదలికలకు మేలు చేస్తాయి. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పియర్ ఫ్రూట్ డైరెక్ట్ తినడం కంటే జ్యూస్ తాగితే కూడా బోలెడు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిలో రాగి పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ ను నియంత్రించడంలో తోడ్పడుతుంది. విటమిన్ బి6, బి3 వంటవి మెదడుకు మేలు చేస్తాయి.

మెదడు అభివృద్ధి (Brain development)కి పని చేయడమే కాకుండా.. వీటిలోని ప్రోటీన్లు (proteins), ఫైబర్ వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతాయి. పియర్ పండును రోజూవారి ఆహారంలో తీసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పండు మధుమేహం సమస్య (Diabetes)కు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. హెయిర్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పియర్ ఫ్రూట్‌లో పొటాషియం (Potassium) దట్టంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నిరోధించడంలో తోడ్పడుతుంది. ఈ పండులో ఉండే ఆరు గ్రాముల ఫైబర్, పెక్టివ్ (Pective), కడుపు ఆరోగ్యాన్ని (Stomach health) మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Next Story

Most Viewed