- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి.. పిడిగుద్దుల గుద్దిన బంధువులు
దిశ సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థిని లైగికంగా వేధించడంతో బంధువులు ఇలా చశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెం-2 ప్రధానోపాధ్యాయుడు శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం చెందారు.
వెంటనే వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. వారి దెబ్బలకు తాలలేక ప్రధానోపాద్యాయుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ విషయం కాస్తా బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు పాఠశాల వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. కీచక ప్రధానోపాధ్యాయిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కొంత సేపు ఆందోళనకు దిగారు. అనంతరంం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు.